కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయింపు

ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం

perni nani
perni nani

అమరావతి: ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. అనంతరం, మీడియాతో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను వివరించారు.

• కాపు మహిళలకు ఆర్థిక సాయం అందించే వైఎస్సార్ కాపు నేస్తం పథకానికి రూ.1101 కోట్లు కేటాయింపు. ఆ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థికసాయం అందజేయాలని, 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75 వేలు అందజేసేందుకు ఆమోదం.

•టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యల 19 నుంచి 29కి పెంపు

•నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని నిర్ణయం.

•కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెదదండ్లూరు వద్ద 3,200 ఎకరాల్లో
నిర్మించనున్న స్టీల్ ప్లాంట్ కు డిసెంబర్ 26న శంకుస్థాపనకు, ఇనుప ఖనిజం కోసం ఎన్ఎండీసీతో ఒప్పందానికి ఆమోదం.

•ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం

సంక్షేమ పథకాల కింద వేర్వేరు కార్డుల జారీకి, పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి, ఆంధ్రప్రదేశ్ పవర్ కార్పొరేషన్ కు బ్యాంకు నుంచి రుణాలు పొందేందుకు, మద్యం ధరలు పెంచుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం.

•జగనన్న వసతి దీవెన పథకం కింద రూ.2,300 కోట్లు, జగనన్న విద్యా దీవెన పేరిట ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.3,400 కోట్లు కేటాయింపు.

•ఆరోగ్య శ్రీ కార్డుల జారీకి, కాంట్రాక్టు ఉద్యోగుల అంశంపై కమిటీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

•ఏపీఎస్పీడీసీఎల్ ను విభజించి సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/