నవరత్నాల బడ్జెట్‌కు ఏపి కేబినెట్‌ ఆమోదం

y s jagan mohan reddy
y s jagan mohan reddy, ap cm

అమరావతి: ఏపిలో వార్షిక బడ్జెట్‌కు వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్‌ కొద్దిసేపటి క్రితం ఆమోదం పలికింది. మరికాసేపట్లో బడ్జెట్‌ ప్రతిపాదనలు అసెంబ్లీ ముందుకు రానున్నాయి. ఈ ఉదయం సచివాలయానికి వచ్చిన జగన్‌ ,తన మంత్రి వర్గ సహచరులతో సమావేశమై, కొత్త బడ్జెట్‌కు ఆమోదం పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాల అమలుపైనే ఈ బడ్జెట్‌ ప్రధానంగా ఫోకస్‌ చేసినట్లు తెలుస్తుంది. కాగా, బడ్జెట్‌ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/