ఏపి శాసనసభ సమావేశాలు ప్రారంభం

AP ASSEMBLY SESSIONS
AP ASSEMBLY SESSIONS

అమరావతి: ఈ రోజు ఉదయం నుంచి ఏపి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ప్రొటెం స్పీకర్‌ అప్పలనాయుడు..కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. శాసనసభ స్పీకర్‌గా తమ్మినేని సీతారామ్‌ను రేపు అధికారికంగా ఎన్నుకోనున్నారు. ఈ నెల 14న ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించనున్నారు. ఏపి సియం జగన్మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/