12 నుండి ఏపిలో అసెంబ్లీ సమావేశాలు?

AP Assembly
AP Assembly

అమరావతి: ఈనెల 12 నుండి ఏపి శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు సమాచాంర 7వ తేదీన వైఎస్‌ఆర్‌సిపి శాసనసభాపక్ష సమావేశంజరుగనుంది. అయితే సిఎం జగన్‌ తన మంత్రివర్గంలోకి ఎవరెవరిని.. ఎందుకు తీసుకుంటున్నది వెల్లడిస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. కాగా 8వ తేదీన సచివాలయంలోని తన చాంబర్‌లో జగ న్ అధికారికంగా అడుగుపెడతారు. అదేరోజు మంత్రివర్గంతో గవర్నర్ నరసింహన్ ప్రమా ణం చేయిస్తారు. పదోతేదీన రాష్ట్ర మొదటి క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఆ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారుచేస్తారు. ఈ నెల 12 నుంచి ఐదురోజులపాటు సమావేశాలు నిర్వహించాలని జగన్ ప్రాథమికంగా నిర్ణయించారు. క్యాబినెట్‌లో తీర్మానించాక.. శాసనసభా కార్యదర్శికి అందజేస్తారు.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:
https://www.vaartha.com/andhra-pradesh/