రాజధానిలో ఆగిన మరో రైతు గుండె

Amaravati farmer died
Amaravati farmer died

అమరావతి: ఏపి రాజధాని అమరావతి తరలిపోతుందనే మనస్థాపంతో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరు గ్రామానికి చెందిన రైతు కంచర్ల చంద్రం(43) సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. చంద్రం రాజధాని కోసం 31 సెంట్ల భూమి ఇచ్చారు. రాజధాని ఉద్యమంలో చంద్రం చురుగ్గా పాల్గొన్నారు. రాజధాని తరలిపోతోందని పదే పదే ఆలోచించి తల నరాలు దెబ్బ తిని చంద్రం చనిపోయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/