ఏపిలో మరో 98 కరోనా పాజిటివ్‌ కేసులు

మొత్తం కరోనా కేసులు 3,377

coronavirus -ap

అమరావతి: ఏపిలో కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 9,986 శాంపిళ్లను పరీక్షించగా మరో 98 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో 29 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 3,377 అని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 1,033 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 2,273 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 71కి చేరింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/