భాగ్యరాజా వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి

vasireddy padma
vasireddy padma

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్మన్‌ వాసిరెడ్డి పద్మ దర్శకుడు భాగ్యరాజా వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాగ్యరాజాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమిళనాడు మహిళా కమిషన్‌కు ఆమె లేఖ రాశారు. రేప్‌ ఘటనల్లో మహిళలను తప్పుబట్టేలా మాట్లాడటం ఎంతమాత్రం మానవత్వం కాదని, చిన్నపిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు వీరికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. భాగ్యరాజా వ్యాఖ్యలు మహిళలను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయన్నారు. మహిళలకు వెంటనే ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మధ్య తమిళనాడులో ప్రకంపనలు సృష్టించిన పొలాచీ రేప్‌ కేసు గురించి భాగ్యరాజా ఓ సినీ ఈవెంట్‌లో ప్రస్తావిస్తూ..ఆ ఘటన వెనుక మగవాళ్ల తప్పులేదని, వివాహేతర సంబంధాల కోసమే ఈ రోజుల్లో మహిళలు భర్తలను చంపుతున్నారని, రేండేసి సిమ్‌ కార్డులు వాడుతున్నారని, మహిళలపై అత్యాచారాలు, వేధింపులకు కూడా సెల్‌ఫోన్లు కారణమని ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/