రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు

సామాన్యుడి సొంతింటి కలే ముఖ్యమంత్రి జగన్‌ ధ్యేయం

vellampalli srinivas
vellampalli srinivas

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని దేవదాయ శాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. విజయవాడ నగరంలో 50వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామని తెలిపారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 26వ డివిజన్‌లో 91 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని వెల్లంపల్లి తెలిపారు. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ధ్యేయమన్నారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపుకు పెద్దపీఠ వేశారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని వెల్లంపల్లి చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/