రీపోలింగ్‌పై ఈసికి సిఈఓ సిఫారసు

gopala krishna dwivedi
gopala krishna dwivedi, ap ceo


అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పోలింగ్‌ కేంద్రాల్లో రీపోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది వెల్లడించారు. గుంటూరు జిల్లాలో రెండు, నెల్లూరు జిల్లాలో రెండు, ప్రకాశం జిల్లాలో ఒక పోలింగ్‌ కేంద్రంలో రీపోలింగ్‌ నిర్వహించాలని సిఈసికి ఏపి సిఈఓ సిఫారసు చేశారు. విలేకరులతో మాట్లాడిని ద్వివేది రీపోలింగ్‌ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలన చేసిన తర్వాత నివేదిక పంపించారని, ఆ నివేదికను సీఈసికి నివేదించామని ఆయన తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రీపోలింగ్‌కు సంబంధించిన ఆదేశాలు రావాల్సి ఉంది. ఈసి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలుంటాయి. ఇతర రాష్ట్రాల్లో తదుపరి దశల్లో జరిగే పోలింగ్‌ కోసం ఏపిలో ఉపయోగించని ఈవిఎంలను తరలించాల్సి వస్తే రాజకీయ పార్టీలు, పోటీ చేసిన అభ్యర్ధులు, మీడియా, అధికారుల సమక్షంలో పరిశీలించి వాటిని తరలిస్తామన్నారు. స్ట్రాంగ్‌ రూంల వద్ద కట్టుదిట్టమైన భద్రత కల్పించామని ద్వివేది అన్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/election-news-2019/andhra-pradesh-election-news-2019/