అమరావతి పోరాటానికి ప్రవాసాంధ్రుల మద్దతు

ప్రధాని మోడి కలగజేసుకోవాలని విన్నపం

Amaravati
Amaravati

అమరావతి: అమరావతిని రాజధానిగా కొనసాగించాలిని రైతులు చేపట్టిన నిరసన 200 రోజులకు చేరుకుంది. ఈక్రమంలోనే అమరావతి ప్రజల పోరాటానికి ప్రవాసాంధ్రులు మద్దతు తెలిపారు. అమెరికాలోని డెట్రాయిట్, మినియాపోలీస్, ఫ్లోరిడా, న్యూజెర్సీ, సియాటెల్, కాలిఫోర్నియా, డల్లాస్ ఆర్కాసాన్స్ తదిర నగరాలతో పాటు… న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, కెనడా, ఇంగ్లాండ్, కువైట్, ఐర్లాండ్, జర్మనీ దేశాల్లో ఉన్న ఎన్నారైలు అమరావతి రైతుల పోరాటానికి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోడి కలగజేసుకోవాలని కోరారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని తుంగలో తొక్కడం సరికాదని అన్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/