బ్రహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి ఆనంద్‌సూర్య రాజీనామా

Ananda Surya
Ananda Surya

విజయవాడ: టిడిపి నేత ఆనంద్‌ సూర్య ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవికి ఈరోజు రాజీనామా చేశారు. విజయవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా 23 నెలల పాటు తాను సేవలు అందించానని ఆనంద్ సూర్య తెలిపారు.తన పదవీకాలంలో ఏపీలోని బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి చేశానని ఆయన తెలిపారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను
సిఎం జగన్ నెరవేర్చాలని కోరారు. భవిష్యత్ లో ఏపీలో టిడిపి బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/