ఏపి స్పీకర్‌గా ఆనం లేదా ధర్మాన?

anam ramanarayana reddy, dharmana prasadarao
anam ramanarayana reddy, dharmana prasadarao


అమరావతి: ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుండి ఏపిలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఐతే సభాపతిగా ఎవరిని నియమిస్తారోనని రాష్ట్రమంతా ఎదురుచూస్తుంది. ఐతే సీనియర్‌ ఎమ్మెల్యే , ఇప్పటికే పలుసార్లు, పలు శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న ఆనం రామనారాయణరెడ్డికి జగన్‌ సముచిత స్థానం కల్పిస్తారనే ప్రచారం జరుగుతుంది. అత్యంత కీలకమైన స్పీకర్‌ పదవికి సమర్థులైన వారు లేకపోవడంతో ఆనం రామనారాయణరెడ్డిని ఆ స్థానంలో కూర్చోబెట్టనున్నట్లు తెలుస్తుంది.
ఎంతో అనుభవం, అవగాహన, అంతకు మించి హుందాతనం, శాంత స్వభావం కలిగిని నాయకులు అవసరం. ఆ కోణంలో చూస్తే, సియం జగన్‌ బృందంలో ఆనం, ధర్మానప్రసాదరావులు ముందు వరుసలో కనిపిస్తారు. ఈ కారణాల దృష్ట్యా వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పీకర్‌ అవుతారని అంచానా వేస్తున్నారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/