రాష్ట్రపతిని కలిసిన అమరావతి రైతులు

ఢిల్లీలో పర్యటిస్తున్న అమరావతి పరిరక్షణ జేఏసీ నేతలు

Ramnath kovind
Ramnath kovind

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఈరోజు అమరావతి పరిరక్షణ సమితి ఐకాస నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు ఏపిరాజధానిగా అమరావతినే కొనసాగించేలా చొరవ తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలనిరాష్ట్రపతికి విన్నవించారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను వివరించారు. గత 52 రోజులుగా రాజధాని కోసం రైతులు, మహిళలు చేస్తున్న ఆందోళనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. కాగా ల్లీలో వారు పలువురు నేతలను కలుస్తున్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/