అమ్మ ఒడి పథకం వచ్చే జనవరి నుంచి అమలు

Adimoolapu suresh
Adimoolapu suresh, education minister

విజయవాడ: పాఠశాలలకు, కాలేజీలకు తన పిల్నల్ని పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేందుకు ఉద్ధేశించిన అమ్మ ఒడి పథకంపై ఏపి ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. పాఠశాలకు వెళ్లే విద్యార్ధులకు మాత్రమే కాకుండా, ఇంటర్‌ విద్యార్థులకు కూడా అమ్మ ఒడి పథకంతో లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. అర్హులైన తల్లులకు ఈ పథకంలో భాగంగా రూ.15 వేలు ఇస్తామని వివరించారు. ఈ మేరకు మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/