అమ్మ ఒడి పథకంలో మరో షరతు

విద్యార్థికి 75 శాతం హాజరు తప్పనిసరి

cm jagan
cm jagan

అమరావతి: ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అమ్మ ఒడి పథకం వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి రానుంది. ఈ పథకం కింద విద్యార్థి తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుడికి విద్యా సాయం కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు (కుటుంబంలో ఒకరికి మాత్రమే) ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. కచ్చితంగా ఆ కుటుంబానికి తెల్ల రేషన్ కార్డు ఉండాలి. విద్యార్థులకు ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రభుత్వ ఉద్యోగులు, పీఎస్యూ ఉద్యోగులు, పెన్షనర్లు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు. తాజాగా ఈ పథకానికి సంబంధించి మరో షరతును విధించారు. 75 శాతం హాజరు కలిగిన విద్యార్థులు మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు. చదువును విద్యా సంవత్సరం మధ్యలోనే ఆపివేసే విద్యార్థులను ఈ పథకం నుంచి తొలగించనున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/