మండలి రద్దు ఏపీ అభివృద్దికి దోహదపడుతుంది

నాడు ఎన్టీ రామారావు తీసుకున్న నిర్ణయమే నేడు సీఎం జగన్‌ తీసుకున్నారు

ambati rambabu
ambati rambabu

తాడేపల్లి: శాసనమండలి రద్దు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్దికి దోహదపడుతుందని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. మంగళవారం ఆయన పార్టీ కార్యలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిన్న జరిగిన శాసనమండలి రద్దు ఒక కీలకమైన తీర్మానమని అన్నారు. 1983లో నాడు ఎన్టీఆర్‌ తీసుకున్న నిర్ణయమే తిరిగి నేడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీసుకున్నారని తెలిపారు. కీలకమైన నిర్ణయం తీసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా సభకు రాలేదని విమర్శించారు. ఏడు నెలల క్రితం ఏర్పడిన ప్రభుత్వాన్ని రద్దు చేయమని ఎలా అడుగుతారు చంద్రబాబు అని అంబటి ప్రశ్నించారు. మీకు అంతా ఉబలాటమే ఉంటే మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలచే రాజీనామా చేయించండని అంబటి సూచించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/