కమనీయం.. అమరేశ్వరుని రథోత్సవం

శివనామస్మరణతో మార్మోగిన అమరారామం

రథోత్సవానికి బయలుదేరిన ఉత్సవ మూర్తులు

అమరావతి(గుంటూరుజిల్లా): చారిత్రాత్మక ప్రాధాన్యంతోపాటు, కేంద్ర ప్రభుత్వంచే వారసత్వ నగరంగా గుర్తింపు పొందిన అమరావతిలో కొలువైవున్న శ్రీబాలచముండికా సమేత శ్రీఅమరేశ్వరస్వామి దివ్యరధోత్సవాన్ని ఆదివారం ఆలయ ఇ.ఓ. కె.సునీల్‌కుమార్‌, ఉత్సవ ప్రత్యేకఅధికారి, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ డి.శ్రీనివాసరావు పర్వేక్షణలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తుల శివనామస్మరణతో అమరావతి పుణ్యక్షేత్రం మారుమ్రోగింది. మహాశివరాత్రి పర్వదినరోజున నూతన దంపతులైన బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివార్ల ఉత్సమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన దివ్యరధంపై అలయ రధోత్సావాన్ని వంశపారంపర్య ధర్మకర్త రాజా వాసిరెడ్డి మురళికృష్ణ ప్రసాద్‌ కొబ్బరికాయ కొట్టి అర్చకుల సమక్షంలో రధం ముందుకు సాగింది. భక్తజనుల శివనామస్మరణలతో రధోత్సవం కన్నుల పండుగగా నిక్వహించారు. వేలాది మంది భక్తులు రధం మోకును పట్టుకొని శంభోశంకర సాంబ శివ శివ అంటూ రధాన్ని ముందకు లాగుతూ ఉత్సవాన్ని దిగ్విజయంగా పూర్తిచేశారు.

స్వామి వారి దివ్యరథోత్సవంలో వేలాది మంది భక్తులు

అమరేశ్వరాలయం నుంచి స్వామివారి రధోత్సవం గాంధీబొమ్మ సెంటరు వరకు సాగింది. రహదారికి ఇకువైపుల భక్తులు స్వామివార్లను దర్శించుకొని భవనాలపై నుంచి రధోత్సవాన్ని తిలకించారు. ఆధ్యాత్మిక ప్రసంగీకులు, అలయ ధర్మకర్తల మండలి మాజీ సభ్యులు పీసపాటి నాగేశ్వరశర్మ రధం ముందుభాగంలో కూర్చోని రధోత్సవ విశేషాలను వివరించారు. రధోత్సవంలో పాల్గొన్న భక్తుల కోరికలు తీనుతాయని అన్నారు. రధం ముందుకు సాగుతుంటే ప్రధాన రహదారిలో ఉప్పొంగిన జనప్రవాహం కనిపించింది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించిన రధోత్సవం 6 గంటలకు ముగిసింది. బాల చాముండికా సమేత అమరలింగేశ్వర స్వామి దివ్యరధోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర పశుసవర్ధక శాఖ మంత్రి వర్యులు మోపిదేవి వెంకటరమణ, బాపట్ల పార్లమోంట్‌ సభ్యులు నందిగం సురేష్‌, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, నంబూరు శంకరరావు, షేక్‌ ముస్తాఫా, మద్దాలి గిరి , చంద్రగిరి యేసురత్నం, లేళ్ళ అప్పిరెడ్డి, వైకాపా నియోజకవర్గ నాయకులు కంచేటి సాయి, నంబూరు బాబురావు, జిల్లా కార్యదర్శి మంగిశెట్టి కోటేశ్వరరావు, మండల వైకాపా అధ్యక్షులు మంగిశెట్టి శ్రీనివాసరావు, వైకాపా నాయకులు నిమ్మా విజయసాగర్‌బాబు, విన్నకోట సాంబశిరావు, మేకల హనుమంతురావు,షేక్‌ హష్మీ,నండూరి కరుణ్‌ కుమార్‌, దార్ల శేషు తదితరులు పాల్గొన్నారు. రధోత్సవంలో ప్రదర్శించిన విచిత్ర వేషధారణలు, కళాకారుల నృత్యాలు, మంగళవాయిద్యాలు, భక్తులను బాగా అలరించాయి. 6 గంటలకు రధాన్ని యధావిధిగా రధశాలలోకి చేర్చారు. రధోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా డిఎస్పీలు వై.శ్రీనివాసరెడ్డి, చిన్నికృష్ణ అమరావతి సి.ఐ. ఎ.శివనాగరాజు, అమరావతి ఎస్సైలు ఎం.శివయ్య, రవీంద్రబాబు 200 మంది అదనపు సిబ్బందితో విధులు నిర్వహించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/