‘అమరావతి’ భవిష్యత్తుపై అన్నీ సందేహాలే!

Amaravati
Amaravati

అమరావతి అద్భుతనగరి. ఆశల ఊపిరి. ఎన్నో సంచలనాలకే కేంద్ర బిందువైంది. ఇప్పుడది ఓ అరిగిపోయిన రికార్డు! విభజిత రాష్ట్రంగా నవ్యాంధ్ర పేరిట అంతులేని ఆశల్ని, ఆర్భాటాన్ని రేకెత్తించింది. ఇంతలోనే వచ్చిన శాసనసభ ఎన్నికల అనంతరం పెను సంచలనాలకు ఈ రాష్ట్రం నడక దారితీసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఎందుకోతెలియని వెలితి ఏర్పడింది.అమరావతి నగర అంకురార్పణ ఘట్టమే ఎన్నో ఆశలను కల్పించింది. ఎక్కడ చూసినా, విన్నా ఆ మాటే ప్రతి ధ్వనించింది. కొత్తరాష్ట్రం కావడంతో కొత్త ఉత్సాహం ఉబికింది. ఎటువెళ్లినా అమరావతి జపం సాక్షాత్కరించింది. ప్రతివారూ ఆంధ్రప్రదేశ్‌ కన్నా అమరావతినే తమ సంభాషణల్లో చెప్పుకో వటం జరిగిపోయింది.

గత శాసనసభ ఎన్నికలయ్యాక కొత్త ప్రభుత్వం కొలువ్ఞ తీరాక ఎన్నడూ లేని విధంగా వివాదాల సుడిలో రాజధాని చిక్కుకుంది. దాదాపు ఏడు నెలల క్రితం పరిస్థితిని, ఇప్పటి పరిణామాలను పోల్చిచూసుకున్నప్పుడు అంతులేని అగాధం మనకు కళ్లకు కట్టింది. ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే రాజధాని నిర్మాణానికి గత ప్రభుత్వం గతి తప్పిన నిర్ణయాల వల్లే ఈ అనర్థం చోటుచేసుకుందని పాలకపక్షనేతలు ఊదరగొడుతున్నారు.

గత పాలకపక్షనేతను అడ్డుపెట్టుకుని అంతు లేని దురాక్రమణ, అక్రమార్జన జరిగిందంటూ ప్రధానంగా భూసేకరణ, సమీకరణే సాక్ష్యమంటూ పేర్కొంటోంది. అమరా వతిలో జరిగిందేమిటి?జరుగుతున్నదేమిటి? ఇది ప్రజల ముందు పెట్టడమే మా ధ్యేయమంటూ ప్రస్తుత పాలకపక్షం చెబుతోంది. దీంతోనే అనుమాన బీజం పడింది. ఎప్పుడైతే అమరావతిలో నిర్మాణ రంగం నిలుపుదలకు దారితీసిందో అప్పుడే అక్కడి సకల జనులు రానున్న ఉపద్రవాన్ని పసిగట్టారు. అప్పటి నుంచే అమరావతిపై అనుమానాలు తడిసిమెపెడయ్యాయి.అమరాతిలో ప్రతిదీ అక్రమమేనంటూ దోపిడీ చిట్టా చాంతాడుగా అధికార పక్షంచెబుతోంది.

అంతెందుకు అలనాటి టిడిపి ప్రభుత్వం చెబు తున్నవే నిజమైతే ఈ రాజధాని ప్రాంతంలోని నియోజకవర్గాల్లో ఆ పార్టీని ప్రజలెందుకు ఓడించారో, జనం ఎంతవిసిగిపోయారో తెలుస్తూనే ఉందంటూ పాలకపక్షం అంటున్నది. మరోవైపు ఏమీ లేనిచోట మహాద్భుతం ఎలాసాధ్యం?అది మా వల్లే జరిగిందని, అర్థం,పర్థం లేని వాదనలు ఆపాలని అమరావతిని చంపేశా రంటూ ఇప్పటి విపక్ష చంద్రబాబు విమర్శలు సంధిస్తున్నారు. ఇక రాజధాని రైతుల విషయాకొస్తే వారిది అంతులేని ఆవేదన. దాదాపు 20రోజులుపైగా రోడ్లెక్కి నిరసనలు తెలిపారు. చిన్నా, పెద్ద రైతులు సైతం తమ భవిష్యత్తుపై క్షోభను అనుభవిస్తు న్నారు.

కారణం గత పాలకుల మాటలు నమ్మి భూములి చ్చేందుకు ముందుకు కదిలారు. ఈ రాజధానుల యోచన రావడంతో సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ భూములపై ఏదో ఒక పరిష్కారం చూపుతామని పాలకప్రభుత్వం పేర్కొంటున్నా డబ్బుల్లేవంటూ ఇప్పుడు చెబుతున్న మాటలు ఎలా నమ్మాలి! ఇది అయ్యేపనేనా! అంటూ ఇవతలి పక్షం నుంచి రైతులు గర్జి స్తున్నారు. ఇకవేళ వెనక్కిస్తే ఆ భూములు ఇప్పుడు సాగుకు పనికి వస్తాయా? మామూలు సాగు రోజుల్లోనే ఏడాదికేడాది భూమి చదును, గట్లు, కలుపులు తీయడం వగైరా పనులు నిరంతరం చేస్తేనేసాగుకు ఉపకరిస్తాయన్నది తెలియదా?ఇలాంటి వెన్నో అంశాలు రైతుల దృక్కోణం నుంచి పెల్లుబుకుతున్నాయి.

చంద్రబాబు హయంలో భూముల్ని లెక్కకు మించి ఆక్రమించా రని, తమ వద్ద నివేదిక ఉందని సిఎం జగన్‌ అంటున్నారు. అదే వాస్తవమైతే సంబంధితులను శిక్షిస్తే సరిలేకుంటే తప్పుల్ని సరిదిద్ది జరిమానాలు విధించాలి. కాకుంటే జైళ్లకు పంపించాలి. న్యాయస్థానాలకు అప్పగించాలి. అంతేకానీ ఇలా చేయడం ఎంత వరకు సమంజసం? భూముల వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని అసలు రాజధాని మార్పునకే పూనుకోవడమేమిటి? దీనివల్ల నష్టపోతున్నది ఎవరు? ఆనాడు అందరి సమ్మతితోనే అసెంబ్లీ తీర్మానంద్వారానే ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి అని లిఖిం చబడిందికదా! అనిరాజకీయ విశ్లేషకులు వక్కాణిస్తున్నారు.

  • చెన్నుపాటి రామారావు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/