మేడారం జాతరకు అమరావతి రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని మొక్కులు చెల్లింపు

Amaravati farmers going to medaram
Amaravati farmers going to medaram

హైదరాబాద్‌: ఏపి రాజధాని అమరావతి ప్రాంత రైతులు నేడు తెలంగాణలో ఎంతో వైభవంగా జరిగే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లనున్నారు. అమరావతి జేఏసి నేతలు ఈ రోజు ఉదయం హైదరాబాద్‌లో ధర్నా చేసిన అనంతరం మేడారం జాతరకు బయలు దేరారు. మేడారం చేరుకున్న తర్వాత అమరావతినే రాజధానిగా కొనసాగించేలా చూడాలని అమ్మవార్లు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోనున్నారు. అనంతరం వారు తిరుగు ప్రయాణం అవుతారు. ప్రత్యేక బస్సులో మేడారం బయలు దేరిన జేఏసి నేతలు జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్‌ అంటూ నినాదాలు చేస్తూ మేడారం జాతరకు వెళ్తున్నారు. కాగా గత 53 రోజుల నుంచి ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. కొందరు రాజధాని గ్రామాల్లో ఆందోళనలు చేస్తుంటే…., మరి కొందరు ఇతర పార్టీలు, నాయకులు, సంస్థల మద్దతు కోరుతూ పర్యటిస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/