ఢిల్లీ బాటపట్టిన రాజధాని రైతులు

కేంద్రం పెద్దలను కలవనున్న రైతు జేఏసి

Amaravati farmers
Amaravati farmers

విజయవాడ: అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ రైతులు కొంతకాలంగా రైతులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. తాజాగా తమ సమస్యను కేంద్రానికి తెలియజేసేందుకు రైతు జేఏసీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ బయలుదేరిన రైతు జేఏసీ నేతలు… హస్తినలో కేంద్ర పెద్దలను కలవాలని నిర్ణయించుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడి, అమిత్ షా తో పాటు 10మంది కేంద్రమంత్రులను కలిసి వినతి పత్రం ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఏపి ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయం కారణంగా అమరావతికి భూములు ఇచ్చిన తమకు తీరని అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర పెద్దలకు వివరించాలని వారు భావిస్తున్నారు. అయితే వీరికి ప్రధాని మోడి, హోంమంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ లభిస్తుందా ? అన్నది తెలియాల్సి ఉంది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఏపి బీజేపీ నేతలు… రైతు బిజెపి నేతలు కేంద్రమంత్రులను కలిసేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/