59వ రోజుకు చేరిన అమరావతి రైతులు నిరసనలు

Amaravati
Amaravati

అమరావతి: అమరావతి రాజధాని రైతుల నిరసనలు 59వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. అటు వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు 59వ రోజుకు చేరాయి. మిగతా రాజధాని గ్రామాల్లోనూ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు పెళ్లిళ్లతో పాటు ఇంటి శంకుస్థాపన కార్యక్రమాల్లోనూ ఉద్యమ నినాదం వినిపిస్తోంది. మూడు రాజధానులు వద్దు…అమరావతే ముద్దు అంటూ రైతులు, మహిళలు నినదిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/