మంత్రులెవ్వరినీ కలవలేదు

రైతులను కూడా మంత్రులు సంప్రదించలేదన్న రాజధాని రైతులు

Amaravati farmers
Amaravati farmers

అమరావతి: మంత్రి బొత్స సత్యనారాయణను తాము కలవలేదని, అదంతా పుకారు అని రాజధాని రైతులు కొట్టిపారేశారు. భూములిచ్చిన రైతులవరూ మంత్రులను కలవలేదన్నారు. అలాగే రైతులను మంత్రులెవరూ సంప్రదించలేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌ అమల్లో ఉండగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని పాదయాత్ర ఎలా చేయనిచ్చారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేస్తున్న రైతుల్ని ఆళ్ల కలవాలని వారు డిమాండ్‌ చేశారు. ఆళ్ల పాదయాత్ర వారి కార్యకర్తల కోసమేనని రైతులు దూషించారు. ఇవాళ ఆళ్ల ర్యాలీ జరిగితే రేపు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులు ర్యాలీలు చేపడతారని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు డిజిపి సమాధానం చెప్పాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. మరోవైపు మందడంలోనూ రైతలు ధర్నాలు కొనసాగిస్తున్నారు. మహిళా కమిషన్‌ సభ్యుల సమయాన్ని కావాలనే అధికారులు వృథా చేశారని వారు ఆరోపించారు. రైతులతో కమిషన్‌ సభ్యులు తక్కువ సమయం కేటాయింటేలా కుట్ర పన్నారని రైతులు విమర్శించారు. ఆందోళనల కారణంగా రాజధాని ప్రాంతాల్లోని గ్రామాల్లో ఏ ఒక్కరూ సంక్రాంతి పండుగ చేసుకునే వాతావరణం కనిపించడంలేదని వారు వాపోయారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/