ఏపి రావణకాష్ఠంలా మారింది

అమరావతిలో దోచుకునేందుకు ఏమీ లేదని జగన్‌ విశాఖకు వెళ్తున్నారు

kanna laxminarayana
kanna laxminarayana

గుంటూరు: బిజెపి ఏపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను ఈ రోజు ఉదయం అమరావతి రాజధాని ప్రాంత రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విశాఖపట్నంలో రాజధానిపై ఉత్తరాంధ్ర ప్రజలు కూడా సానుకూలంగా లేరని ఆయన అన్నారు. రెండు కార్పొరేట్ సంస్థల చేతిలో ప్రజలు నలిగిపోతున్నారని టిడిపి, వైఎస్‌ఆర్‌సిపిని ఉద్దేశించి ఆయన పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో రైతుల భూములతో స్థిరాస్తి వ్యాపారం చూశారని, ప్రస్తుతం సీఎం జగన్‌ ఇక్కడ దోచుకునేందుకు ఏమీ లేదన్న కారణంతో విశాఖ వెళ్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ విధానాలతో ఆంధ్రప్రదేశ్ రావణకాష్ఠంలా మారిందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అవినీతికి పాల్పడాలన్న ఆలోచన తప్పా ఏపీ ప్రభుత్వానికి మరో ఆలోచనే లేదని ఆరోపించారు. విశాఖ పట్నం రాజధాని అయితే తమ సమస్యలు వస్తాయన్న భయంతో ఉత్తరాంధ్రప్రజలు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. అమరావతే రాజధానిగా ఉండాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/