జగన్‌ రాజధానిపై తన వైఖరి సృష్టం చేయాలి

Kanna Lakshminarayana
Kanna Lakshminarayana

అమరావతి: ఏపి సిఎం జగన్‌ రాజధాని అమరావతిపై తన వైఖరిని సృష్టం చేయాలని ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్‌ చేశారు. రాజధాని అంశంపై రాష్ట్ర ప్రభుత్వం చెప్పే దానికి చేసే దానికి పొంతన లేదని విమర్శించారు. తమ ప్రాంతంలో రాజధాని వస్తుందని మూడు పంటలు పండే పొలాలను రైతులు త్యాగం చేశారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు కనిపిస్తోందని, ఇప్పటికే వేలాది కోట్లు రాజధాని నిర్మాణానికి వెచ్చించారని అన్నారు. రాజధాని రైతులకు బిజెపి అండగా ఉంటుందని, రాజధాని అమరావతిలోనే ఉండాలని తాము భావిస్తున్నామని చెప్పారు. త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని తనను కలిసిన రైతులతో కన్నా పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/