అమరావతిలో రైతుల పాదయాత్ర

20వ రోజుకు చేరిన రాజధాని రైతుల నిరసన

farmers
farmers

తుళ్లూరు: ఏపిలో రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేపట్టిన నిరసనలు నేటికి 20వ రోజుకు చేరుకున్నాయి. తూళ్లూరు నుండి 10 వేల మంది రైతులు, మహిళలు, యువకులతో తుళ్లూరు నుంచి రాయపూడి మీదుగా మందడం వరకు పాదయాత్ర జరగనుంది. కాగా రైతుల పాదయాత్రకు పోలీసులు అనుమతి లేదని చెప్పారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పోలీసులు అనుమతి నిరాకరించినా.. ర్యాలీని జరిపితీరుతామని, ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. టెంట్‌ వేసుకునేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారని, రహదారిపైనే బైఠాయించి ఆందోళన తెలుపుతామని స్పష్టం చేశారు. రాజధాని తరలింపు, పరిహార ఖర్చులు కలిపి సుమారు రూ.75వేల కోట్లు అవుతాయని, ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎక్కడనుంచి తెస్తుందో చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/