పదేళ్ల కష్టానికి ప్రతిఫలం

ALLA RAMA KRISHNA REDDY, MLA
ALLA RAMA KRISHNA REDDY, MLA

Vijayawada: పది సంవత్సరాలుగా ప్రతి సామాన్యుడు, పేదవాడు, రైతు పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే మా కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రజలు పదేళ్లు అనేక కష్టాలు ఓర్చి ఆయన వెంట నడిచారని, వైయస్‌ జగన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసుకోవడం 30 సంవత్సరాల జీవితానికి ప్రజలు బాట వేసుకున్నారన్నారు. నవరత్నాలను మించిన పథకాలు భారతదేశ రాజకీయ చరిత్రలో ఉండవని వైయస్‌జగన్‌ నిరూపించుకోబోతున్నారన్నారు. గతంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డివైపు దేశం చూసిందని, మరోసారి ఆయన తనయుడి వైపు చూస్తుందన్నారు.