కరకట్ట పక్కన చంద్రబాబు ఉన్న ఇల్లును ఖాళీ చేయిస్తాం

alla rama krishna reddy
alla rama krishna reddy


అమరావతి: కృష్ణానది కరకట్ట పక్కన ఉన్న నివాసం నుంచి టిడిపి అధినేత చంద్రబాబును ఖాళీ చేయిస్తామని వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం ఆయన అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ..కృష్టానది కరకట్టపై అక్రమ నిర్మాణాలకు సంబంధించి కోర్టుకు వెళ్తామని స్పష్టం చేశారు. రాజధానిలో ఇల్లు కూడా లేని చంద్రబాబు రాజధాని గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధాని పనులు ఎందుకు ఆపేశారో గుత్తేదారులే సమాధానం చెప్పాలని, గుత్తేదారులకు అనుమానాలు ఉంటే ప్రభుత్వాన్ని సంప్రదించాలని సూచించారు.

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/