రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఒకేలా అభివృద్ధి చేయాలి

రాజధాని రైతుల భయాలను పోగొట్టే చర్యలను రాష్ట్రం ప్రభుత్వం చేపట్టాలి

T. G. Venkatesh
T. G. Venkatesh

అమరావతి: మూడు రాజధానుల వల్ల సర్వం కోల్పోతామన్న భయం అమరావతి రైతుల్లో ఉందని ఆ భయం పోగొట్టే చర్యలను ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం చేపట్టాలని బిజెపి రాజ్యసభ సభ్యుడు టి.జి వెంకటేష్‌ అన్నారు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో రాజధాని పెడితే రాయలసీమకు దూరమవుతుందని, అందువల్ల సీమలోనే రాజధాని ఏర్పాటుచేస్తే ఇంకా బాగుంటుందన్నారు. హైకోర్టు రాయలసీమలో పెట్టడంవలన సీమకు ప్రత్యేకంగా ఒరిగేది ఎమిలేదని కాకపోతే కొంతలో కొంత సంతృప్తి ఉంటుందని అన్నారు. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ అంటున్నారు కావునా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఒకేలా అభివృద్ది చేయాలని టి.జి వెంకటేష్‌ డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ తమ డిమాండ్‌ అని, తమ స్టాండ్‌ ఎప్పటికీ మారదని ఆయన స్పష్టం చేశారు. ఇంకా విశాఖను రాజధానిగా చేస్తే అమరావతిలో మినీ సెక్రటేరియట్‌ నిర్మించాలని ప్రభుత్వానికి టి.జి వెంకటేష్‌ సూచించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/