అఖిలప్రియ హౌస్‌ అరెస్ట్‌

Akhila priya House Arrest
Akhila priya House Arrest

Amaravati: చలో ఆత్మకూరు నేపథ్యంలో పోలీసులు టీడీపీ నేతలను ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు. చలో ఆత్మకూరుకు బయల్దేరకుండా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు టీడీపీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. చలో ఆత్మకూరుకు బయల్దేరిన టీడీపీ నాయకురాలు అఖిలప్రియను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా చలో ఆత్మకూరును పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో వాగ్వివాదానికి దిగుతున్నారు.