సిఎంకు ధన్యవాదాలు తెలిపిన అజేయ కల్లం

ajay kallam
ajay kallam

అమరావతి: ఏపి సిఎం జగన్‌కు ముఖ్య సలహాదారుగా మాజీ సీఎస్‌ అజేయ కల్లంను నిన్న రాత్రి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం ఆయన సిఎం జగన్‌ను తాడేపల్లిలోని నివాసంలో కలిశారు. సిఎం ముఖ్యసలహాదారుగా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. . అజేయ కల్లం మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారని, ఆయన వేతనాన్ని రూ.2.5లక్షలుగా పేర్కొంది. అజేయ కల్లం పేషీకి 10 మంది సిబ్బందిని సమకూరుస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/