ప్రమాణస్వీకార ఏర్పాట్లపై జగన్‌ అధికారులతో సమీక్ష

jagan
jagan

అమరావతి: ఏపికి కాబోయే సిఎం వైఎస్‌ జగన్‌ తన ప్రమాణస్వీకార ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ తాడేపల్లిలోని తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. వీవీఐపీలు, ప్రజలు ప్రమాణస్వీకారోత్సవాన్ని చూసేందుకు చేస్తున్న ఏర్పాట్లను కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ జగన్‌కు వివరించారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరంలోనూ డిజిటల్‌ తెరలు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. జగన్‌ విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 30న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/