పార్వతిపురంను జిల్లా చేయాలి!

విజయనగరంలో ఆదివాసీల ఆందోళన

Y S jagan mohan reddy
Y S jagan mohan reddy, ap cm

అమరావతి: ఏపిలో తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాల ఏర్పాటు చేస్తామని, గ్రామానికో సెక్రటేరియట్‌ నిర్మిస్తామని వైఎస్‌ఆర్‌సిపి అధినేత, ప్రస్తుత ఏపి సియం వైఎస్‌ జగన్‌ గతంలో ప్రకటించారు. అంటే ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా చేస్తామని జగన్‌ చెప్పారు. ఐతే ఈ విషయంలో ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో పార్వతిపురం డివిజన్‌ను ఆదివాసీ జిల్లాగా చేయాలని ప్రజాసంఘాలు, ఆదివాసీలు ఈ రోజు ఆందోళనకు దిగారు. విజయనగరంలోని రాయగఢ్‌ రోడ్డునుంచి సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఏపి సియం జగన్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా వీరు డిమాండ్‌ చేశారు. వెంటనే పార్వతీపురం డివిజన్‌ను ఆదివాసీ జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/