కేబినెట్‌ భేటీలో నవ్వుల పువ్వులు

Adinarayana Reddy
Adinarayana Reddy

Amaravati: ఏపీ కేబినెట్‌ భేటీలో మంత్రి ఆదినారాయణ రెడ్డి నవ్వుల పువ్వులు పూయించారు. సీరియస్‌గా జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో ఆదినారాయణ చమత్కారం ఒక్కసారిగా నవ్వులు పూయించాయి. మంత్రి ఆదినారాయణ రెడ్డి సమావేశం జరుగుతుండగా మధ్యలో కల్పించుకొని తిత్లీ, ఫణి తుపాన్ల గురించి ముందే చెప్పిన ఆర్టీజీఎస్ బాబు ఎన్నికల్లో ఓట్ల సునామీ గురించి ముందే చెప్పరా? అని సీఎంను ఉద్దేశించి సరదా వ్యాఖ్యలు చేయగా సమావేశంలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు. మంత్రి వ్యాఖ్యకు స్పందించిన సీఎం చంద్రబాబు అంతే చమత్కారంగా ఓట్ల సునామీ గురించి ఆర్టీజీఎస్ బాబు మీ చెవిలో చెబుతారులే ఆదినారాయణ అని సమాధానం చెప్పడంతో సమావేశంలో అందరూ ఒక్కసారిగా నవ్వేశారు.