టిడిపి సభ్యులపై చర్యలు తీసుకోవాలి

perni nani
perni nani

అమరావతి: టిడిపి సభ్యులు సభలో వ్యవహరించిన తీరు బాధించిందని మంత్రి పేర్ని నాని అన్నారు. అధినేత చంద్రబాబు నాయుడు మెప్పుకోసం తాపత్రయ పడ్డారని, గౌరవ సభ్యులు హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. ఈ రోజు మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ..అసెంబ్లీలో మార్షల్‌పై టిడిపి సభ్యులు దుర్భాషలాడరని సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యులు కానివారిని మార్షల్స్‌ లోనికి అనుమతించరని టిడిపి సభ్యులకు తెలియదా అని ప్రశ్నించారు. మార్షల్‌పై దుర్భాషలాడిన టిడిపి సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. మార్షల్స్‌ సభ్యుల భద్రత కోసమే ఉన్నారని తెలుసుకోవాలని టిడిపి సభ్యులకు సూచించారు. ఇది పార్టీల వ్యవహారం కాదని..ఇది శాసన సభ అని హితవు పలికారు. సభ్యులు గుంపుగా వస్తున్నప్పుడు ముందస్తు జాగ్రత్తగా మార్షల్స్‌ తగిన చర్యలు తీసుకుంటారని స్పీకర్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/