ఏపి విత్తనాభివృద్ధి ఛైర్మన్‌ పదవికి సుబ్బారెడ్డి రాజీనామా

A V subbareddy
A V subbareddy

నంద్యాల: ఏపి విత్తనాభివృద్ది సంస్థ ఛైర్మన్‌ పదవికి ఏవి సుబ్బారెడ్డి మంగళవారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో తన పదవికి రాజీనామా మా చేస్తున్నట్లు సియం జగన్‌కు పంపిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. రాజీనామా పత్రాన్ని విజయవాడలోని ఏపి విత్తనాభివృద్ది సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌కు ఏవి సుబ్బారెడ్డి అందజేశారు. ఈ విషయంపై ఆయన మాట్లాడుతూ..టిడిపి ప్రభుత్వం తనకు అప్పజెప్పిన బాధ్యతను 9 నెలల పాటు సమర్ధవంతంగా నిర్వహించానని పేర్కొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/