జనసేన-బిజెపి నేతల కీలక సమావేశం

Janasena-BJP
Janasena-BJP

విజయవాడ: నేడు జనసేన-బిజెపి నేతలు విజయవాడలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రస్తుతం ఏపిలో రాజకీయ పరిస్థితులు, తమ కార్యచరణ ప్రణాళికపై నేతలు చర్చించనున్నారు. బిజెపి నుంచి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంత రెడ్డితో పాటు పలువురు నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. అలాగే జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శివశంకర్, కందుల దుర్గేశ్, చిలకం మధుసూదన రెడ్డి తదితరులు పాల్గొంటున్నారు. రాజధాని రైతుల తరఫున పోరాడతామని ఇప్పటికే బిజెపి, జనసేన ప్రకటించాయి. ఈ రోజు భేటీలో ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను జనసేన నేతలు పవన్ కల్యాణ్‌కు వివరించి, అనంతరం రాజధాని పోరాటంపై కార్యాచరణ ప్రణాళిక గురించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/