ఏపిలో ప్రారంభమయిన నగదు పంపిణీ కార్యక్రమం

money
money

అమరావతి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో రేషన్‌కార్డు దారులకు ఏపిలో నగదు పంపిణి కార్యక్రమం కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఆర్ధిక సాయం రూ.1000 పంపిణి నేడు ఉదయం ప్రారంభమైంది. ఇందులో భాగంగా పలు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు ఈ నగదు పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా వాలంటీర్లు లభ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు పంపిణి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.30 కోట్ల రేషన్‌ కార్డుల్లో మ్యాపింగ్‌ చేసిన 1.19 కోట్ల కార్డుదారులకు వాలంటీర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి నగదును అందిస్తుండగా.. మ్యాపింగ్‌ కాని 13,12,890 కార్డుదారులకు వారి పరిధిలోని గ్రామ సంక్షేమ, విద్య సహయకులు లేదా వార్డు సంక్షేమ కార్యదర్శి అందించనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/