ఏపీలో కొత్తగా 9,996 కేసులు నమోదు

ఆసుపత్రుల నుంచి 9,499 మంది డిశ్చార్జి

corona virus -ap

అమరావతి: ఏపిలో కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 9,996 మంది కొత్తగా కరోనా బారిన పడ్డారు.  దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,64,142కు చేరుకుంది. ఇదే సమయంలో 82 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 2378కు చేరుకుంది. ప్రస్తుతం 90,840 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.  తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో 1,504 కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో విశాఖపట్నం 931, చిత్తూరు 963, అనంతపురం 856, కర్నూలు 523 ఉన్నాయి. మరోవైపు గత 24 గంటల్లో 9,499 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,64,142కి చేరుకున్నాయి.

జిల్లాల వారీగా కరోనా కేసులు..

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/