రైతులకు రేపటి నుంచి 9 గంటల ఉచిత విద్యుత్‌

jagan mohan reddy
jagan mohan reddy, AP CM

అమరావతి: వరుస సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన ముద్ర కనబరుస్తున్న ఏపి సియం వైఎస్‌ జగన్‌ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని చెప్పడమే కాదు. చేతల్లో కూడా చేసి చూపించారు. ఇందులో భాగంగా రాష్ట్ర రైతాంగానికి సియం జగన్‌ శుభవార్త చెప్పారు. రేపటి నుంచి వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా విద్యుత్‌ శాఖ అధికారులను సియం ఆదేశించారు. తాడేపల్లిగూడెంలోని క్యాంపు కార్యాలయంలో విద్యుత్‌ శాఖ అధికారులతో సియం సమీక్ష జరిపారు. విద్యుత్‌ సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. 60 శాతం ఫీడర్లలో పంపుసెట్లకు పగటిపూట ఉచిత విద్యుత్‌ అమలు చేయాలని ఆదేశించారు. మిగతా 40 శాతం ఫీడర్లలో పనులకు రూ.1700 కోట్లు విడుదల చేశారు. ఫీడర్లలో పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

తాజా హీరోయిన్‌ల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actress/