గుంటూరు జిల్లాలో 80 శాతం పోలింగ్‌

voters
voters

అమరావతి: గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 80 శాతం పోలింగ్‌ నమోదు అయింది. హింసాత్మక, అల్లర్లతోపాటు గుంటూరు జిల్లా అట్టడికిపోయింది. మరోవైపు ఈవీఎంలు మోరాయించడంతో ప్రజలు గంటలతరబడి క్యూలైన్లలో నిలబడి వెనుదిరిగి వెళ్లిపోయారు. తాడికొండ నియోజకవర్గంలో మధ్యాహ్నం 12 గంటల వరకు 50 శాతం ఈవీఎంలు పనిచేయలేదు. అర్థరాత్రి 12 గంటలవరకు చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేయడంతో పోలింగ్ శాతం మారే అవకాశం ఉన్నట్లు సమాచారం.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/