తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్లు ఎత్తివేత


3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల

బళ్లారి : తుంగభద్రకు వరద నీరు పోటెత్తింది. మలెనాడు ప్రాం తంలో ధారాకారంగా కురుస్తున్న వర్షాలతో టీబీ డ్యామ్‌కు భారీగా వర్షం వచ్చి చేరు తోంది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి డ్యామ్‌కు చెందిన మొత్తం 33 క్రస్ట్‌ గేట్లను తెరిచి 3లక్షల క్యూ సెక్కుల నీరు దిగువకు వదిలారు. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులోకి 8,46,949క్యూసెక్కుల నీరు వస్తోంది. నాగార్జున సాగర్‌లోకి 7,47,642 క్యూసె క్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. సాగర్‌ ప్రాజెక్టులో ఆదివారం సాయంత్రానికి 545 అడుగుల నీరు ఉంది. మరో రెండు మూడు రోజుల్లో గరిష్ఠ నీటిమట్టానికి సాగర్‌ చేరుకునే అవకాశం ఉంది. గత ఏడాది ఇదే సమ యంలో నాగార్జున సాగర్‌లో 519.50 అడుగుల నీరుంది. ఆదివారం కుడి, ఎడమ కాల్వలకు నీటి విడుదల చేయగా సోమవారం 5క్రస్ట్‌ గేట్లు ఎత్తి దిగువకు లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/