మాచర్ల నుంచి 30 మంది కరోనా అనుమానితులు గుంటూరుకు తరలింపు

జిజిహెచ్‌లో పరీక్షలు

Isolation ward
Isolation ward

Macherla/ Guntur: ఒకేసారి 30 మంది కరోనా అనుమానితులను అయిదు 108 అంబులెన్సుల్లో గుంటూరు జిజిహెచ్‌కు ఆదివారం మధ్యాహ్నం తరలించారు.

గుంటూరుజిల్లా మాచర్ల పట్టణం నుంచి గుంటూరు జిజిహెచ్‌కు వీరిని పరీక్షల నిమిత్తం తరలించారు.

ఇదిలా ఉండగా, గుంటూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి ఇచ్చిన విందులో పాల్గొన్నవారిలో విదేశాల నుంచి వచ్చినవారుండగా, మరికొందరు ఇతర ప్రాంతాలనుంచి వచ్చినవారున్నారు.

వారికి అన్ని వైద్యపరీక్షలు చేసిన తర్వాతపూర్తి వివరాలు వెల్లడిస్తామని వైద్యాధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/