శ్రీకాకుళం జిల్లాలో 250 కిలోల గంజాయి పట్టివేత

Ganjai
Ganjai

శ్రీకాకుళం: జిల్లాలోని పలాస మండలం జాతీయ రహదారిలో రామకృష్ణాపురం దగ్గలో కాశిబుగ్గు పోలీసులు 250 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.20 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.గంజాయి తరలిస్తున్న మహిళతో సహా ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం నుంచి ఎంహెచ్ 39డి1110 నెంబరు గల కారు ఇచ్చాపురం వైపు వెళ్తుండగా గంజాయిని తరలిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/