199వ సంక‌ల్ప‌యాత్ర కార్యాచ‌ర‌ణ‌

Y S Jagan
Y S Jagan

అమలాపురం: వైఎస్సార్సీ, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 198వ రోజు సోమవారం పి.గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలంలో జననేత పాదయాత్ర చేశారు. రేపు (మంగళవారం) ఇదే మండలం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం కానుంది. రేపు ఉదయం పాశర్లపూడి బాడవ నుంచి వైఎస్‌ జగన్‌ 199వ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు. తర్వాత అమలాపురం నియోజకవర్గం, అల్లవరం మండలంలోని బోడసకుర్రు మీదుగా దేవరలంక క్రాస్‌ చేరుకుని, అక్కడ నుంచి అమలాపురం మండలం పెరూరు, పెరూరుపేట వై జంక్షన్‌ చేరుకొని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు. తర్వాత కొంకపల్లి, అమలాపురం వరకు పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం అమలాపురంలో జరిగే బహిరంగ సభలో జననేత ప్రసంగిస్తారు.