కేంద్రం పెత్త‌నాన్ని ఓప‌లేం: చంద్ర‌బాబు

AP CM BABU
AP CM BABU

అమ‌రావ‌తిః సీఎం చంద్రబాబును ఐఎంఏ బృందం కలిసింది. కేంద్ర క్లీనికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్టును అసెంబ్లీలో ఆమోదించడంపై ఐఎంఏ బృందం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని ఆస్పత్రులపై కేంద్రం పెత్తనం పెరుగుతుందన్నారు. ఏపీకి మినహాయింపు ఉన్నప్పటికీ చట్టం చేయడమేంటని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఆస్పత్రులపై కేంద్రం పెత్తనాన్ని సహించబోమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. దీనిపై నివేదిక ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.