154వ ప్రజాసంకల్పయాత్ర కార్యాచరణ

Y S Jagan 2
Y S Jagan

కృష్ణా: వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు జగన్‌ 154వ ప్రజాసంకల్ప యాత్ర కార్యాచరణను ఖరారైంది. ఈ కార్యాచరణను వైఎస్సార్సీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం విడుదల చేశారు. పెడన నియోజవర్గంలో కొంకెపూడి శివారు నుంచి ఆదివారం జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి రెడ్డిపాలెం, వడ్లమన్నాడు. వేమవరం, కవుతారం మీదుగా గుడ్లవల్లేరు వరకు పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారిని ప్రజలకు భరోసానిస్తూ పాదయాత్ర చేస్తున్నారు.