గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష అభ్యర్థులకు 15 గ్రేస్ మార్కులు

Grama and Ward Secretariat Examination (File)

Amaravati: గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష రాసిన అభ్యర్థులకు 15 గ్రేస్ మార్కులు కలపాలన్న ప్రభుత్వ నిర్ణయంతో చాలామందికి లబ్ధి కలగనుంది. అదనపు మార్కులు జతచేసి రూపొందించిన జాబితా ఆధారంగా 40 వేలకు పైగా మిగిలి పోయిన ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. రేపటి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభంకానుంది.ప్రభుత్వ నిర్ణయం వల్ల వివిధ కేటగిరీలో మిగిలిన అనేక ఉద్యోగాలు భర్తీ అవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పరీక్ష రాసి ఉద్యోగం సాధించలేకపోయిన వారందరికీ 15 మార్కులు కలిపే ప్రక్రియను అన్ని జిల్లాల అధికారులు చేపట్టారు. 
శనివారం నుంచి అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభించనున్నారు. వీరందరికీ సోమవారం నియామకపత్రాలు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది..అన్ని జిల్లాల్లో కలిపి మిగిలి పోయిన 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/