ఏపిలో ఒక్కరోజే 1,322 మందికి కరోనా

రాష్ట్రంలో మరో ఏడుగురి మృతి

corona virus -ap

అమరావతి: ఏపిలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. రాష్ట్రంలో తాజాగా 1322 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. అంతేకాదు, ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 197, తూర్పుగోదావరి జిల్లాలో 171, అనంతపురం జిల్లాలో 142, కర్నూలు జిల్లాలో 136, చిత్తూరు జిల్లాలో 120, పశ్చిమ గోదావరి జిల్లాలో 106, విశాఖపట్నం జిల్లాలో 101 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో ఏడుగురు మృత్యువాత పడ్డారు. దాంతో కరోనా మరణాల సంఖ్య 239కి పెరిగింది. తాజాగా 424 మంది డిశ్చార్జి కాగా, 10,860 మంది చికిత్స పొందుతున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/