127వ ప్ర‌జాసంక‌ల్ప యాత్ర కార్యాచ‌ర‌ణ‌

Y S Jagan
Y S Jagan

గుంటూరు :వైఎస్సార్సీ అధినేత‌, ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన 127వ రోజు ప్రజాసంకల్పయాత్ర కార్యాచ‌ర‌ణ‌ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్సార్సీ రాష్ట్ర కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఉదయం శ్రీరామ్‌నగర్‌ శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. చుట్టిగుంట, అంకమ్మనగర్‌, ఎత్తురోడ్‌ సెంటర్‌ మీదుగా నల్లచెరువు చేరుకుంటారు. మూడుబొమ్మల సెంటర్‌, ఫ్రూట్‌ మార్కెట్‌, జిల్నా టవర్‌ సెంటర్‌ మీదుగా కింగ్‌ హోటల్‌ సెంటర్‌ వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.