ఎపిలో 11 కరోనా కేసులు

విజయవాడలో తాజా కేసు గుర్తింపు

corona cases in ap
corona cases in ap

విజయవాఢ: ఆంధ్రప్రదేశ్‌లో మరో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపిలో కరోనా బాధితుల సంఖ్య 11కి చేరుకుంది.

విజయవాడకు చెందిన 28 ఏళ్ళ యువకునిలో గురువారం వైద్యాధి కారులు కరోనా పాజిటీవ్‌ను గుర్తించారు.

ఈ యువకుడు స్వీడన్‌ నుంచి ఢిల్లీ మీదుగా విజయవాడకు ఈ నెల18 తారీఖున వచ్చాడు. ఇతను జలుబు,దగ్గు.జ్వరం లాంటి లక్షణాలు ఉండటంతో విజయవాడ జిజిహెచ్‌ను ఆశ్రయించారు.

వైద్య పరీక్షలు అనంతరం అతనిలో కరోనా పాజిటీవ్‌ లక్షణాలు ఉన్నట్లుండి గుర్తించారు.ఇతను ఢిల్లీనుంచి విజయవాడకు ప్లయిట్‌లో వచ్చాడు.

అక్కడి నుంచి క్యాబ్‌లో ఇంటికి వచ్చారు.దీంతో అతనితో ప్రయాణించిన వారి వివరాలు,క్యాబ్‌ డ్రైవరు వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

ఈ కేసుతో విజయవాడలో3 కరోనా పాజిటీవ్‌ కేసులు నమోదయ్యాయి.ఇక బుధవారం ఏపీలో 2 పాజిటీవ్‌ కేసులు గుర్తించారు,

ఈ నెల 20 న అమెరికాలోని వాషింగ్టన్‌ నుంచి విజయ వాడకు వచ్చిన యువకుడి(22)కి కరోనా సోకింది.

అలాగే ఈ నెల 14న ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మసీదులో మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న గుంటూరుకు చెందిన వ్యక్తి(52)కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/